Home > టెక్నాలజీ > విక్రమ్ ల్యాండర్ తీసిన మొదటి చందమామ ఫోటో

విక్రమ్ ల్యాండర్ తీసిన మొదటి చందమామ ఫోటో

విక్రమ్ ల్యాండర్ తీసిన మొదటి చందమామ ఫోటో
X

చంద్రయాన్-3 నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ రోజురోజుకూ చంద్రునికి దగ్గర అవుతోంది. ఒక్కో కక్ష్యను తగ్గించుకుంటూ జాబిల్లి మీద అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది విక్రమ్ జాబిల్లి మొదటి ఫోటో తీసింది. చంద్రుని కక్ష్యలో తిరుగుతూ ఉపరితలాన్ని ఫోటోలుగా తీసింది. వీటిని ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్ ప్రొపల్షన్ నుంచి విడిపోయిన కొద్దిసేటికే ఈ ఫోటోలను తీసిందని ఇస్రో తెలిపింది. వీటిలో చంద్రుని మీద ఉన్న బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రీ, గియార్డనో, బ్రునో, హర్కేబి జే...ఆ బిలాల పేర్లని చెప్పింది. గియార్డనో బ్రనో చంద్రుని మీద ఉన్న అతి పెద్ద బిలాల్లో ఒకటి. దీనిని ఈ మధ్యనే గుర్తించారు. హర్కేబి జే బిలం దాదాపు 43 కిమీల వ్యాసం ఉంటుంది.

మరోవైపు విక్రమ్ ల్యాండర్ డీ బూస్టింగ్ ప్రక్రియ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. దీంతో ల్యాండర్ వేగం తగ్గిస్తారు. ఇప్పటివరకు ల్యాండర్, అందులో ఉన్న రోవర్ లు ఎటువంటి డ్యామేజీలు కాకుండా బావున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. రెండో బూస్టింగ్ ఆగస్టున 20 తెల్లవారుఘామున చేస్తారు. దీంతో విక్రమ్ చంద్రునికి మరింత చేరువ అవుతుంది.


Updated : 18 Aug 2023 7:22 PM IST
Tags:    
Next Story
Share it
Top