Home > టెక్నాలజీ > జాబిల్లికి చేరువవుతున్న భారత ఘనత

జాబిల్లికి చేరువవుతున్న భారత ఘనత

జాబిల్లికి చేరువవుతున్న భారత ఘనత
X

చంద్రయాన్-3లో కీలక ఘట్టం ఈరోజు జరిగింది. చంద్రయాన్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఇక మీదట ఇది సొంతంగా చంద్రుని చుట్టూ తిరుగుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 23న జాబిల్లి మీద అడుగు పెడుతుంది.

ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. చంద్రునిపై దిగడమే తరువాయి. ఈరోజు ల్యాండర్ చంద్రుని చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని, ఫోటోలను ఇస్తుంది. జూలై13న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ -3 ను ఇస్రో భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తరువాత నుంచి దాని కక్ష్యను పెంచుకుంటూ వచ్చారు. ఇలా మొత్తం 18 రోజుల వ్యవధిలో 5సార్లు కక్ష్యను పొడిగించారు. భూ కక్ష్య పూర్తయ్యాక చంద్రయాన్-3 టాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రయాణించింది. ఆగస్టు1న ఇది మొదలైంది. అక్కడి నుంచి ఆగస్టు5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి క్రమంగా కక్ష్యను తగ్గిస్తూ జాబిల్లికి చంద్రయాన్ ను చేరువ చేశారు.

చంద్రయాన్-3 నుంచి విక్రమ్ ల్యాండర్ సజావుగా విడివడింది. ఇది మరికొన్ని రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతూ...దానికి మరింత చేరువ అవుతుంది. దాని ద్వారా జాబిల్లి మీద అడుగు పెట్టడానికి సిద్ధం అవుతుంది. ఇస్రో లెక్కల ప్రకార్ ఈ నెల 23న సాయంత్రం 5.47 నిమిషాలకు ల్యాండర్ చంద్రుని మీద అడుగుపెడుగుంది. అది కానీ సక్రమంగా జరిగితే మనం విజయం సాధించినట్టే. చంద్రుని మీద భారత జెండా ఎగిరినట్టే.


Updated : 17 Aug 2023 2:16 PM IST
Tags:    
Next Story
Share it
Top