Home > టెక్నాలజీ > Mission Aditya-L1 : చంద్రుడిపై మరోసారి ల్యాండ్ అయిన విక్రమ్

Mission Aditya-L1 : చంద్రుడిపై మరోసారి ల్యాండ్ అయిన విక్రమ్

Mission Aditya-L1 : చంద్రుడిపై మరోసారి ల్యాండ్ అయిన విక్రమ్
X

చంద్రయాన్ 3 విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, రోవర్ తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేశాయి. ప్రస్తుతం రోవర్ స్లీప్ మోడ్లో ఉంది. అగస్ట్ 23న జాబిల్లిపై సేఫ్గా ల్యాండ్ అయిన విక్రమ్.. ఇవాళ మరోసారి ల్యాండ్ అయ్యింది. దీన్నికోసం నిర్వహించిన ఎక్స్పరిమెంట్ సక్సెస్ అయ్యినట్లు ఇస్రో ట్వీట్ చేసింది.





ఇస్రో శాస్త్రవేత్తలు కమాండ్ ఇవ్వగానే ల్యాండర్ పైకి లేచి పక్కకు సేఫ్గా ల్యాండ్ అయ్యింది. శాస్త్రవేత్తలు కమాండ్ ఇచ్చిన వెంటనే ల్యాండన్ ఇంజిన్లు ఫైర్ అయ్యాయి. ఆ తర్వాత 40 సెం.మీ ఎత్తుకు లేచి 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఒక‌వేళ చంద్రుడి నుంచి మ‌ళ్లీ భూమ్మీద‌కు శ్యాంపిల్స్ తీసుకురావాల‌న్నా లేక మాన‌వుల త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నా ఈ ప్ర‌యోగం ఎంతో కీల‌క‌మైంద‌ని ఇస్రో తెలిపింది.





ప్రస్తుతం విక్ర‌మ్ ల్యాండ‌ర్‌కు చెందిన అన్ని సిస్ట‌మ్స్ నార్మ‌ల్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు ఇస్రో స్పష్టం చేసింది. త్వరలోనే విక్రమ్ ల్యాండర్నూ స్లీప్ మోడ్ లోకి పంపించనుంది. ప్రస్తుతం చంద్రుడిపై రాత్రి కావొస్తుంది. తిరిగి సెప్టెంబర్ 22న సూర్యోదయం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మళ్లీ రోవర్, ల్యాండర్ ను ఇస్రో యాక్టివేట్ చేయనుంది.




Updated : 4 Sep 2023 8:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top