Home > టెక్నాలజీ > ఆయన లేకపోతే ఇస్రోనే లేదు.. చంద్రయాన్ 3 ల్యాండర్కూ ఆయన పేరే..

ఆయన లేకపోతే ఇస్రోనే లేదు.. చంద్రయాన్ 3 ల్యాండర్కూ ఆయన పేరే..

ఆయన లేకపోతే ఇస్రోనే లేదు.. చంద్రయాన్ 3 ల్యాండర్కూ ఆయన పేరే..
X

అంతరిక్ష పరిశోధనల్లో చిన్న అడుగులతో మొదలైన భారతదేశ జైత్రయాత్ర జాబిల్లిపైకి రోవర్‌ను పంపే స్థాయికి చేరింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌పంచానికి భార‌త శ‌క్తిని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇస్రో సాధించిన విజయాలతో ఆకాశమే చిన్నబోయింది. అయితే గగనతలంపై భారత్ విజయాలు సాధిస్తుందంటే అందుకు మూలకారణం విక్రమ్ సారాభాయ్.

ఇస్రో ఘన చరిత్ర వెనుక.. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ కృషి ఎనలేనిది. అసలు ఇస్రోనే స్థాపించిందే ఆయన వల్ల అని చెప్పొచ్చు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు.. భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు వివరించారు విక్రమ్. భారత్లోనూ అలాంటిది ఏర్పాటు చేద్దామని ఒప్పించి.. 1962లో భారత ప్రభుత్వం ఇస్రోను ఏర్పాటు చేసేలా కృషి చేశారు.

హోమీ బాబాతో కలిసి..

భారత అణు విజ్ఞాన పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా తోడ్పాటుతో సారాభాయ్ భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. ఇస్రో తయారుచేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19 న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. దానికి నాలుగేళ్ల ముందే 1971 డిసెంబర్ 30న విక్రమ్ కన్నుమూశారు.

భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమయిన అన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్.. ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలనూ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసే దిశగా తన టీంను నడిపించాడు. కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు. అలా తయారైనదే సెటిలైట్ లాంచ్ వెహికిల్ (SLV). ఆ తర్వాత వచ్చిన pslv,gslv రాకెట్ లాంచర్లు దేశానికి ఎన్నో విజయాలను అందించాయి.

ఇక గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైందిగా ఉండేది. సామాన్యులకు టెక్నాలజీని చేరువ చేస్తే.. దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించొచ్చని ఆయన భావించారు. ఆ విధంగానే ఆయన ముందుకుసాగారు. ప్రస్తుతం చంద్రయాన్ 3.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్గా ల్యాండ్ అయ్యింది. విక్రమ్ సారాభాయ్ చేసిన కృషికి గౌరవంగా ల్యాండర్ కు విక్రమ్ అని పేరు పెట్టారు.

మిస్సైల్ మ్యాన్..

ఇస్రో కీర్తిని రెపరెపలాడించిన వారిలో కలామ్ కూడా ఒకరు. భారత సైన్యం కోసం ఒక తేలికపాటి హెలికాఫ్టర్‌ను రూపొందించడంతో తన సొంత పరిశోధనల్ని ప్రారంభించిన ఈ అద్భుతమైన వ్యక్తి.. భారత్‌ అమ్ముల పొదిలోని అనేక క్షిపణి అస్త్రాల రూపకర్తగా అందించిన సేవలు తిరుగులేనివి. బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ వంటి పరిశోధనల్లో ఆయన కీలకవ్యక్తి. పోఖ్రాన్‌ 2 పరీక్షల్లో కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. ఇలా ఇస్రో ఘనకీర్తిలో ఎందరో మహానుభావులు దేశం కోసం శక్తుల్ని ధారపోశారు.



Updated : 23 Aug 2023 9:19 PM IST
Tags:    
Next Story
Share it
Top