Vivo X100 series: వివో నుంచి ప్రీమియం ఫోన్.. ఐఫోన్ కన్నా అద్భుతం
X
వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) పేరుతో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పటికే వీటి ప్రీ బుక్కింగ్స్ మొదలయ్యాయి. జనవరి 11 నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. SBI, HDFC కార్డ్స్ పై ప్రీ బుక్కింగ్ చేసుకుంటే 10 శాతం క్యాష్ బ్యాక్, రూ.8 వేల అప్ గ్రేడ్ బోనస్ పొందొచ్చు. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై లుక్కేద్దాం..
Vivo X100 Specifications:
వివో ఎక్స్100 (Vivo X100):
వివో ఎక్స్100లో 50 ఎంపీ సోనీ IMX920 వీసీఎస్ బయోనిక్ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 64 ఎంపీ Zeiss సూపర్ టెలిఫొటో కెమెరా ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్. 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.63,999 కాగా.. 16జీబీ+512జీబీ రూ.69,999గా ఉంది.
Vivo X100 pro Specifications:
వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro):
వివో ఎక్స్100 ప్రో.. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో వస్తుంది. 5,400mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో.. 50 ఎంపీ సోనీ IMX989 OIS కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 50 ఎంపీ Zeiss APO సూపర్ టెలిఫొటో లెన్స్ ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్. 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.89,999గా నిర్ణయించారు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో లాంచ్ అవుతుంది.
Telugu News,Business News,Smartphone,Tech News,Vivo,Vivo X100 series Specifications,Vivo X100 Smartphone,tech news,Vivo X100 series price,Vivo X100 price,Vivo X100 series launch date