Home > టెక్నాలజీ > మా దగ్గర చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలోనే.. : ఇస్రో ఛైర్మన్‌

మా దగ్గర చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలోనే.. : ఇస్రో ఛైర్మన్‌

మా దగ్గర చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలోనే.. : ఇస్రో ఛైర్మన్‌
X

చంద్రుడిపై ఇస్రో పంపిన చంద్రయాన్ 3 రోవర్ ప్రయోగాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అవి తమ కంప్యూటర్‌ సెంటర్కు వెళ్తున్నాయని.. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని తెలిపానే. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు.

ఇక జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని సోమనాథ్ చెప్పారు. వచ్చే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు శివ్‌శక్తి అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. అంతేకాకుండా చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.

చంద్రుడిపై ఉష్ణోగ్రతలు..

విక్రమ్ ల్యాండర్ లోని ChaSTE (చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్) పేలోడ్.. చంద్రుడి ఉపరితలంతో పాటు కాస్త లోతులో సేకరించిన సాంపిల్ ఉష్ణోగ్రతల లెక్కలను గ్రాఫ్ రూపంలో తెలిపింది. దీనికున్న పది సెన్సర్ల సాయంతో.. చంద్రుడి నేలపై దాదాపు 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, టెంపరేచర్ లను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్ కు ఉంది.

ChaSTE పేలోడ్ పంపిన గ్రాఫ్ను విశ్లేషించిన పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. కాగా చంద్రుడి ఉపరితలంపై 50-60డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు సమాచారం.



Updated : 28 Aug 2023 5:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top