ఐఫోన్లో ‘i’ అంటే అర్థం తెలుసా?
X
ఐఫోన్ అంటే ఇష్టపడని వారుండరు. ధరలు ఎంత పెరిగిపోతున్నా.. అప్పుచేశైనా కొంతమంది ఐఫోన్ కొంటుంటారు. మరీ ముఖ్యంగా యూత్ లో ఐఫోన్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. మార్కెట్ లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ నే ఇష్టపడుతుంటారు. యాపిల్ అందించే సెక్యూరిటీ, క్వాలిటీ, ఫీచర్స్ కు చాలామంది అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా కెమెరా ఇందులో బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా పక్కనపెడితే.. ఐఫోన్ లో ‘i’ అనే అక్షరం గురించి ఎంతమందికి తెలుసు? అసలు ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దాని గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.
కొందరు ఐఫోన్ లో ఐ అంటే.. ఇడియట్, యాపిల్ ఆఫ్ మై అంటూ.. ఎదో ఒకటి చెప్తుంటారు. కానీ ఐఫోన్ లో ఐకి వేరే అర్థం ఉంది. యాపిల్ కంపెనీ తన ఐఫోన్ కు కచ్చితమైన అర్థాన్ని చెప్తుంది. ‘i’ అనేది ఐదు అక్షరాల పదాన్ని సూచిస్తుంది. 1998లో స్టీవ్ జాబ్స్ దీని అర్థాన్ని చెప్పాడు. ఐఫోన్ లో ‘i’ అంటే.. ఇంటర్నెట్, ఇండివిడ్యువల్, ఇన్ స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్ స్పైర్ అని అర్థం. దీనికి టెక్నికల్ గా ఎలాంటి అఫిషియల్ మీనింగ్ లేదని స్టీవ్ జాబ్స్ స్పష్టం చేశాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.