Home > టెక్నాలజీ > పాలను ఫ్రిడ్జిలో పెడుతున్నారా... అయితే ఈ విషయాలు మీకు తెలుసా?

పాలను ఫ్రిడ్జిలో పెడుతున్నారా... అయితే ఈ విషయాలు మీకు తెలుసా?

పాలను ఫ్రిడ్జిలో పెడుతున్నారా... అయితే ఈ విషయాలు మీకు తెలుసా?
X

ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఫ్రిడ్జి చాలా కామన్ అయిపోయింది. వస్తువులు పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్ కంపల్సరీ అయిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా పాలను తప్పకుండా అందరూ ఫ్రిడ్జిలోనే ఉంచుతారు. అయితే ఇలా చేసే వాళ్ళు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

వేడిగా ఉంటే పాలు ఇట్టే పాడయిపోతాయి. ఇప్పుడు అందరూ పాలపేకెట్సే వాడుతున్నారు. అస్తమానం వెళ్ళి తెచ్చుకోవడం అవ్వదు కాబట్టి ఉదయాన్నే తెచ్చుకుని ఫ్రిడ్జిలో పెట్టుకుని రోజంతా వాడుకుంటుంటారు. ఒకొక్కప్పుడు రెండు, మూడు రోజుల తర్వాత కూడా వాడుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే...పాలను ఫ్రిడ్జ్ డోర్ లో పెట్టకూడదు. డోర్ అస్తమానం తీసి వేస్తుంటాం. అప్పుడు లోపల ఉన్న చల్లగాలి బయటకు వచ్చేస్తుంది. వేడిగాలి లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది. ఈ కారణంగా పాలు తొందరగా పాడయిపోతాయి. ఇది మామూలుగా ఎవరో చెప్పిన విషయం కాదు డెయిరీ ఆఫ్ కాలిఫోర్నియానే స్పందించి తేల్చిన విషయం.

పాలను ఎప్పుడు ఫ్రిడ్జ్ లో వెనుక భాగంలో ఉంచాలి. ఎప్పుడూ చల్లగానే ఉండే ప్రదేశంలో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. డోర్లు తెరిచినా ఎక్కువ ప్రభావం పడదు అని ఏ ప్లేస్ అయితే ఉంటుందో అక్కడే పాల ప్యాకెట్లను కానీ, సీసాలను కానీ దాచుకోవాలి. అలాగే ఫ్రజీర్ లో కూడా పాలను పెట్టుకోవచ్చును. ఏ సీజన్ అయినా ఇదే పద్ధతిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

పాలు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ప్రీజర్ అయితే బెస్ట్ అంటున్నారు. కానీ ఒకరోజు కన్నా ఎక్కువ పాలను నిల్వ ఉంచడం మంచిది కాదని చెబుతున్నారు.

Updated : 22 July 2023 8:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top