Whatsapp Update : వాట్సాప్ చాట్ సెర్చ్ ఇక మరింత సులభం..కొత్త అప్‌డేట్ ఇదే
X
(WhatsApp chat search) ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. ఈ ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్ తాజాగా మరో సరికొత్త అప్‌డేట్‌ను తెచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో తేదీల ప్రకారంగా చాట్‌ను సెర్చ్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. పర్సనల్, గ్రూప్ చాట్‌లను తేదీలను బట్టి సెర్చ్ చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించాడు.
వాట్సాప్ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ.. తేదీల ద్వారా వాట్సాప్ చాట్‌ను సులభంగా సెర్చ్ చేయొచ్చని తెలిపారు. తేదీని ఎంచుకుని చాట్‌ను చూసుకోవచ్చన్నారు. మనకు అవసరమైన రోజు ఆ తేదీలను టైప్ చేసి నేరుగా ఆరోజు జరిగిన చాట్‌ను చూడొచ్చని జుకర్‌బర్గ్ వివరించారు. ఇప్పటికే ఈ ఆప్షన్ ఐవోఎస్, మ్యాక్, డెస్క్‌టాప్ డివైజ్‌లలో అందుబాటులోకి ఉంది.
తాజాగా ఆండ్రాయిడ్ డివైజ్‌లపై ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. ఏదైనా చాట్, లేదా గ్రూప్ చాట్ లోకి వెళ్లి పేరుపై ట్యాప్ చేస్తే సెర్చ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ తేదీని ఎంటర్ చేస్తే ఆ రోజు జరిగిన వాట్సాప్ చాట్‌ను సులభంగా చూడొచ్చు. ఇకపోతే ఈ మధ్యనే వాట్సాప్ టెక్ట్స్ ఫార్మాట్లకు షార్ట్ కట్‌లను కూడా చెప్పింది. అలాగే బుల్లెట్ పాయింట్లు, ఇన్‌లైన్ కోడ్, బ్లాక్ కోట్‌ల ఫార్మాటింగ్ ఆప్షన్లను కూడా వాట్సాప్ యాప్ వాడుకలోకి తీసుకొచ్చింది.