Home > టెక్నాలజీ > వాచ్ నుంచే వాట్సప్ రిప్లై.. ఎలా అంటే..?

వాచ్ నుంచే వాట్సప్ రిప్లై.. ఎలా అంటే..?

వాచ్ నుంచే వాట్సప్ రిప్లై.. ఎలా అంటే..?
X

మెస్సేజింగ్ యాప్స్లలో వాట్సప్ స్పెషలే వేరు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యూజర్లను ఆకట్టుకుంటోంది ఈ సంస్థ. వాట్సప్ ఫోన్లలోనే కాకుండా డెస్క్ టాప్ లలోనూ ఇన్నాళ్లు ఉపయోగించారు. ఈ క్రమంలో యూజర్లకు వాట్సప్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై స్మార్ట్ వాచ్ లలోనూ వాట్సప్ వాడొచ్చని తెలిపింది. వాచ్లలో కూడా వాట్సప్ మెసేజ్లకు రిప్లై కూడా ఇవ్వొచ్చని ప్రకటించింది.





గూగుల్​ వాచ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ వేర్​ ఓఎస్​3 తో పని చేస్తున్న అన్ని రకాల స్మార్ట్​వాచ్​లలో వాట్సప్ పనిచేయనుంది.సేమ్ ఫోన్ లాగే టెక్స్ట్, వాయిస్, ఎమోజీలను సెండ్ చేయొచ్చు. Wear OS వెర్షన్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా చాట్స్, వాయిస్ మెసేజ్‌లు, ఇతర కంటెంట్‌ భద్రతకు డోకా లేదని తెలుస్తోంది. ఈ యాప్ మేలో బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది.

వేర్​ ఓఎస్ కోసం వాట్సాప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. అయితే యాపిల్ వాచ్లలో వాట్సప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు కాల్స్ వరకు మాత్రమే పరిమితమైన స్మార్ట్ వాచ్లు.. ఇక వాట్సప్ ఫీచర్ తోనూ అదరగొట్టనున్నాయి.





Updated : 21 July 2023 12:58 PM IST
Tags:    
Next Story
Share it
Top