వాట్సాప్ గ్రూప్ చాట్ అప్డేట్.. కొత్త ఫీచర్స్తో
X
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు వాట్సాప్ వాడుతుంటారు. కోట్లాది మంది రోజు దినచర్యలో భాగం అయిపోయింది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లు ఇకనుంచి గ్రూప్ సభ్యులను చాట్ లోనే సులువుగా చేర్చుకోవచ్చు. ప్రస్తుతం బీటా 23.15.1.77 వెర్షన్ లో ఉన్న ఈ ఫీచర్ మొదట ఐఓఎస్ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలో మిగతా యూజర్లకు అందుబాటులో వస్తుందని వాట్సాప్ బీటాఇన్ఫో తెలిపింది. ఇటీవలే వాట్సాప్ రియల్ టైం వీడియో మెసేజ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రియల్ టైం వాయిస్ మెసేజ్ ఫీచర్ లాగేనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. వాట్సాప్ నుంచే డైరెక్ట్ గా 60 సెకంన్ల వీడియోను రికార్డ్ చేసి పంపొచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ను ఎలా వాడాలని మెటా సీఆఓ మార్క్ జుకర్ బర్గ్ వీడియోలో తెలిపారు.