Home > టెక్నాలజీ > whatsapp update : వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్.. టోగుల్‌‌తో వెరీ ఈజీ

whatsapp update : వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్.. టోగుల్‌‌తో వెరీ ఈజీ

whatsapp update : వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్.. టోగుల్‌‌తో వెరీ ఈజీ
X

ప్రముఖ మెసేజింగ్ యాప్స్ వాట్సాప్ (WhatsApp)..తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. రీసెంట్‌గా షార్ట్ వీడియో మెసేజెస్ (Short video messages) ఫీచర్‌ను iOS, ఆండ్రాయిడ్ యూజర్లకు రిలీజ్ చేసింది. ఈ స్పెసిఫికేషన్‌తో 60 సెకన్ల నిడివి గల వీడియో మెసేజ్‌లను యాప్‌లోనే రికార్డ్ చేసి, చిటికెలో షేర్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్‌తో వాయిస్ మెసేజ్‌ల మాదిరిగా వీడియో మెసేజ్‌లు పంపించడాన్ని సులభతరం చేయడం పట్ల యూజర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది మాత్రం నిరాశను వ్యక్తపరిచారు. ఎక్కువగా వాయిస్ మెసేజ్‌లు పంపించే వారు ఈ కొత్త ఫీచర్‌తో అసంతృప్తి వ్యక్తం చేశారు.





ఎందుకంటే వాయిస్ మెసేజ్‌లు పంపించాలని అనుకున్నప్పుడు ఒక్కోసారి పొరపాటున వీడియో మెసేజ్‌ మోడ్‌కి సెలెక్ట్ అయిపోతుంది. దీనివల్ల యూజర్లు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అయితే దానికి పరిష్కారంగా వీడియో మెసేజెస్ కంప్లీట్‌గా డిసేబుల్ చేసుకునే కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ పరిచయం చేస్తోంది. వాట్సాప్ తాజాగా చాట్ సెట్టింగ్స్‌ మెనూలో ఇన్‌స్టంట్ వీడియో మెసేజెస్ ఫీచర్ మేనేజ్ చేసుకోవడానికి. వాట్సాప్ చాట్ సెట్టింగ్స్ మెనూలోకి కొత్త టోగుల్‌ (New Toggle)ను జోడించింది. ఇది ఇన్‌స్టంట్ వీడియో మెసేజ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనిని డిసేబుల్ చేసుకుంటే వాయిస్ రికార్డర్ పై నొక్కితే కేవలం వాయిస్ మాత్రమే రికార్డు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో మోడ్ కు మారదు. అయితే కొంతమంది బీటా వెర్షన్లకు మాత్రమే ఈ వాట్సాప్ కొత్త టోగుల్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు టెస్ట్ ఫ్లైట్ యాప్ నుంచి ఈ బీటా వెర్షన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.




Updated : 8 Sept 2023 8:38 AM IST
Tags:    
Next Story
Share it
Top