Home > టెక్నాలజీ > వాట్సాప్లో ఫైల్స్, డేటా ట్రాన్స్ఫర్ ఇక ఈజీగా..

వాట్సాప్లో ఫైల్స్, డేటా ట్రాన్స్ఫర్ ఇక ఈజీగా..

వాట్సాప్లో ఫైల్స్, డేటా ట్రాన్స్ఫర్ ఇక ఈజీగా..
X

మొబైల్ మార్చినప్పుడు చాలామందికి డేటా ట్రాన్స్ ఫర్ ఓ తలనొప్పి. పాత ఫోన్ లో ఉన్న చాట్స్, ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ కొత్త ఫోన్ లోకి బ్యాకప్ చేసుకుందామంటే.. డ్రైవ్ సైజ్ సరిపోక ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యను పోగొట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. క్లౌడ్, డ్రైవ్ బ్యాకప్ అవసరం లేకుండా.. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కు డేటాను ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అది కూడా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతోనే.. షేర్ చేసుకోవచ్చు.





షేర్ ఇట్ లాంటి ఈ ఫీచర్ పనిచేయాలంటే.. మీ రెండు ఫోన్లు ఒకే నెట్వర్క్ కు కనెక్ట్ అయి ఉండాలి. వైఫై డైరెక్ట్ ద్వాదా డేటా ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా వర్షన్ టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు. ఈ ఫీచర్ కావాలంటే.. WhatsApp -> Chats -> Chat transfer ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడుండే క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ చేసి డేటా ట్రాన్స్ ఫర్ చేయాలి. ఇలా చేసిన డేటా పూర్తిగా ఎన్ క్రిప్ట్ మోడ్ లో ఉంటుందని మెటా తెలిపింది.





Updated : 1 July 2023 8:07 PM IST
Tags:    
Next Story
Share it
Top