Home > టెక్నాలజీ > వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి
X

యూజర్లను ఆకట్టుకునేందుకు, బెటర్ ఎక్స్ పీరయన్స్ అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ తీసుకొస్తుంటుంది. లాక్ చాట్, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ ఫీచర్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎప్పటినుంచే వాట్సాప్ యూజర్లు డిమాండ్ చేస్తున్న ఫీచర్ హై క్వాలిటీ ఇమేజ్. వాట్సాప్ లో ఎవరికైనా ఫొటో సెండ్ చేస్తే ఆటోమెటిక్ గా ఫొటో క్వాలిటీ తగ్గిపోయి సెండ్ అవుతుంది. అలా కాదని పూర్తి క్వాలిటీతో సెండ్ చేయాలంటే.. డాక్యుమెంట్ లో సెండ్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సమస్యకు చెక్ పెట్టింది వాట్సాప్.

తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త అప్ డేట్ ను తీసుకొస్తోంది. ఇకపై హెడ్ డీ ఫొటోలు పంపుకునే వీలు కల్పిస్తున్నారు. ఎప్పటిలాగే ఫొటోలు పంపిచుకునే ఆప్షన్ లోకి వెళ్లి ఫొటో సెలక్ట్ చేసుకోవాలి. సెండ్ కొట్టేముందు ఫొటో క్వాలిటీ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ కనిపించే స్టాండర్డ్ మోడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫొటోలు వర్జినల్ క్వాలిటీలో పంపించుకోవచ్చు. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.



Updated : 17 Aug 2023 10:39 PM IST
Tags:    
Next Story
Share it
Top