Home > టెక్నాలజీ > అదిరిపోయిన వాట్సాప్ ఫీచర్.. ఒకేసారి రెండు ఫోన్స్లో..

అదిరిపోయిన వాట్సాప్ ఫీచర్.. ఒకేసారి రెండు ఫోన్స్లో..

అదిరిపోయిన వాట్సాప్ ఫీచర్.. ఒకేసారి రెండు ఫోన్స్లో..
X

యూజర్లను ఆకట్టుకునేందుకు, బెటర్ ఎక్స్ పీరయన్స్ అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ తీసుకొస్తుంటుంది. లాక్ చాట్, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ ఫీచర్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇకపై వాట్సాప్ లో రెండు వేర్వేరు అకౌంట్స్ ను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఒక ఫోన్ లో రెండు వాట్సాప్ లు వాడాలంటే క్లోన్ వాట్సాప్ అన్నా చేసుకోవాలి లేదంటే డ్యూయల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పడు తెచ్చిన ఈ ఫీచర్ తో ఒకేసారి రెండు వాట్సాప్ లు ఒకే యాప్ నుంచి వాడుకోవచ్చు.

వాట్సాప్ ఇప్పటివరకు ఒక ఫోన్ లో ఒక అకౌంట్ మాత్రమే వాడుకునే వీలుండేది. ఇప్పుడు ఈ ఫీచర్ ను ఎలా వాడాలంటే.. వాట్సాప్ అకౌంట్ లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద బాణం ఐకాన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే డ్యూయల్ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని సాయంతో మరో అకౌంట్ ను వాట్సాప్ లో యాడ్ చేసుకోవచ్చు. అచ్చ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఈ ఫీచర్.. వాట్సాప్ లోనూ తీసుకురానున్నారు. ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో వచ్చింది. త్వరలో మిగతా యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Updated : 12 Aug 2023 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top