Home > టెక్నాలజీ > వాట్సాప్లో కాల్ బ్యాక్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే..

వాట్సాప్లో కాల్ బ్యాక్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే..

వాట్సాప్లో కాల్ బ్యాక్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే..
X

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారుల అవసరాలకు ఎప్పుడూ కొత్త కొత్త అప్ డేట్స్ తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు టెలిగ్రామ్, స్నాప్ చాట్ లో అందుబాటులో ఉన్న కాల్ బ్యాక్ ఫీచర్ ను.. వాట్సాప్ లో తీసుకురాబోతున్నారు. WABetaInfo కొత్త వెర్షన్ 2.2323.1.0 రాబోతున్న ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..

ఇదివరకు వాట్సాప్ లో వీడియో, ఆడియో కాల్ చేస్తే కేవలం నోటిఫికేషన్ మాత్రమే చూపించేది. తిరిగి కాల్ చేయాలంటే.. కాల్స్ ఆప్షన్ లోకి వెళ్లి, కాల్ బ్యాక్ చేయాలి. అయితే, ఇప్పుడు కొత్తగా తెస్తున్న ఈ అప్ డేట్ లో కాల్ బ్యాక్ ఫీచర్ ను యాడ్ చేయనున్నారు. అంటే చాట్ లో మిస్డ్ కాల్ తో పాటు.. కాల్ బ్యాక్ అని కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచే డైరెక్ట్ కాల్స్ చేసి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Updated : 18 Jun 2023 4:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top