Home > టెక్నాలజీ > chandrayaan 3: చందమామపై హక్కు ఎవరిది?

chandrayaan 3: చందమామపై హక్కు ఎవరిది?

chandrayaan 3: చందమామపై హక్కు ఎవరిది?
X

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్లిన చంద్రయాన్ -3.. జాబిల్లిపై అడుగుపెట్టింది. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని దక్షిణ ధృవంపై 6.03 గంటలకు కాలుమోపి మోపి భారత్ సత్తాను విశ్వానికి చాటి చెప్పింది. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, చైనాలకు అందని ద్రాక్షలా ఉన్న ఈ ప్రయోగాన్ని భారత్ చేసి చూపెట్టింది. ఇదే క్రమంలో చంద్రుడిపై ప్రపంచ దేశాల ఆసక్తి మరింతగా పెరిగింది. వరుసగా చందమామపై స్పేస్ షిప్స్‎ను పంపుతున్నాయి. ఈ క్రమంలో చందమామపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. అందరూ జాబిల్లి ఎవరి సొంతం అని పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై

అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. అవేమిటో మనమూ చూసేద్దాం.





అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐరాస.. ఔటర్‌ స్పేస్‌ ట్రీటీని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం చూసుకుంటే చందమామపై అక్కడి ఖగోళ వస్తువులపై ఏ దేశం ప్రత్యేకించి అధికారాన్ని ప్రకటించుకోకూడదు. ఇక్కడ జరిగే అన్వేషణలు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ప్రయోజనం పొందేలా ఉండాలి. అయితే ఈ ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావనే ఉందే కానీ చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించ వచ్చా లేదా అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో 1979లోని మూన్‌ అగ్రిమెంట్‌ తెరపైకి వచ్చింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే ఏ ప్రభుత్వమైనా,దేశమైనా, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలైనా, వ్యక్తులైనా కూడా చందమామను తమ ప్రాపర్టీగా ప్రకటించడానికి వీలులేదు. అక్కడ కాలనీలను నిర్మించుకుని జాబిల్లి మాదే అంటే ఏరకంగానూ చెల్లుబాటు కాదు. చందమామతో సమ, అక్కడి న్యాచురల్ రిసోర్సస్ అన్నీ కూడా మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి వచ్చింది. అయితే చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఇంకా ఈ ఒప్పందంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఈ క్రమంలో అమెరికా 2020లో అర్టెమిస్‌ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. జాబిల్లిపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఇందులో కెనడా, జపాన్‌, ఐరోపాతో పాటు పలు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌ కూడా ఈ మధ్యనే ఇందులో చేరింది.














Updated : 24 Aug 2023 4:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top