ఉమెన్స్ డే స్పెషల్.. అమెజాన్ అందిస్తోన్న బంపరాఫర్లు
X
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెజాన్ అదిరిపోయే బంపరాఫర్లను తీసుకొచ్చింది. వివిధ రకాల గిఫ్ట్ ఆర్టికల్స్‌తో పాటుగా మహిళలకు కావాల్సిన అన్ని వస్తువులను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు అవసరమైన వస్తువులను రూ.199లకే ప్రారంభ ధరగా నిర్ణయించింది. కిరాణా, హ్యాంపర్స్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిషింగ్ వంటి వాటిపై అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.
టెలివిజన్, స్పీకర్లు, కెమెరాల వంటి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి వాటిపై 65 శాతం వరకూ డిస్కౌంట్స్ ఇస్తోంది. వైర్‌లెస్ మౌస్, పవర్ బ్యాంక్‌లు, బ్లూటూత్ స్పీకర్‌లు, ల్యాప్‌టాప్ స్టాండ్‌లు వంటివి తక్కువ ధరకే అందిస్తోంది. వంటగది సామాన్లపై 70 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఇతర దేశాలకు బహుమతులను పంపేందుకు కూడా అమెజాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ రూ.1199కే లభిస్తుంది. 1.83 అంగుళాల స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ ఉంది. అలాగే సీఎస్-01 ప్లాస్టిక్ షేకర్ బాటిల్ రూ.188కే కొనుగోలు చేయొచ్చు. యాంటీ స్లిప్ ట్రూలీ రివర్సిబుల్ యోగా మ్యాట్ విత్ గైడ్‌అలైన్ ఫ్రమ్ టెగో రూ.2,699కే లభించనుంది. రాకర్జ్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ రూ. 999కి కొనుగోలు చేయొచ్చు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.