Home > టెక్నాలజీ > ప్రాణాలు కాపాడే AI అండర్ వాటర్ కెమెరా.. ధర ఎంతంటే..?

ప్రాణాలు కాపాడే AI అండర్ వాటర్ కెమెరా.. ధర ఎంతంటే..?

ప్రాణాలు కాపాడే AI అండర్ వాటర్ కెమెరా.. ధర ఎంతంటే..?
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. ఇది మెల్లిగా అన్ని రంగాలకు పాకుతోంది. ఏఐతో నష్టాలు పక్కనబెడితే ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నారు. కొత్తగా మనిషి ప్రాణాలు కాపాడే ఏఐ కెమెరా వచ్చింది. అమెరికన్ కంపెనీ తయారు చేసిన ఈ కెమెరా ఇటీవలె మార్కెట్లో రిలీజ్ అయ్యింది.

ఇది అండర్ వాటర్ సెక్యూరిటీ కెమెరా. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసుంది. ఈత కొట్టేటప్పుడు ఎవరైనా ప్రమాదాలకు గురైతే ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి వారి కుటుంబీకులను అలర్ట్ చేస్తుంది. అమెరికను కంపెనీ అయిన కోరల్ దీనిని రూపొందించింది.

ఈ అండర్‌వాటర్‌ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో కోరల్ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,23,781గా ఉంది.

ఈ కెమెరా ఇళ్లు, హోటల్స్‌లో ఉండే స్విమింగ్‌పూల్స్‌లో ఉపయోగించొచ్చు. ఈ కెమెరా నిరంతరం స్విమింగ్‌పూల్‌ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే దీని యాప్‌ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకులను తక్షణమే అలర్ట్ చేస్తుంది.


Updated : 27 Aug 2023 11:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top