Home > టెక్నాలజీ > World's Most Expensive EV : మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుంది, ఈ కారు గురించి వింటే...

World's Most Expensive EV : మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుంది, ఈ కారు గురించి వింటే...

Worlds Most Expensive EV : మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుంది, ఈ కారు గురించి వింటే...
X

ఖరీదైన కార్లు, బైక్ లు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అత్యంత ధనవంతులు అందరి దగ్గరా ఆల్మోస్ట్ కోట్ల విలువ చేసే కార్లు ఉంటాయి. అదేమీ పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు చెప్పుకునే కారు మాత్రం చాలా స్పెషల్. దీనిని ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే కొనుక్కోగలరు. ఎందుకో...ఏమిటో...మీరూ ఓ లుక్కేసేయండి.

వరల్డ్ మోస్ట్ రిచ్చెస్ట్ కారును పినిన్ పరీనా అనే కంపెనీ తయారు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన కారుగా గుర్తింపు పొందింది. అన్నింటికంటే ముఖ్యమైన సంగతేంటంటే ఇది ఎలక్కటిక్ వెహికల్. దీని ధర 4.4 మిలియన్ యూరోలు అంటే...మన కరెన్సీలో 39.8 కోట్లు అన్నమాట. ఈ రకం కార్లను పినిన్ ఫరీనా కంపెనీ కేవలం పదింటిని మాత్రమే తయారు చేసింది. అవి కనుక అమ్ముడైపోతే తరువాత మరి కావాలన్నా కొనుక్కోలేరు. దీనికి బి95 రోడ్ స్టర్ హైర్ అని పెట్టారు.

ఈ హైపర్ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ వేగంతో పరుగెడుతుందిట. ఇందులోని మోటార్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుందని చెబుతోంది కంపెనీ. ఇంది 120 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంది. దీనికి 270 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జ్ చేయాలి. కేవలం 25 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకూ ఛార్జ్ చేసేసుకోవచ్చును. బి95 రోడ్ స్టర్ జస్ట్ 2 సెకెన్స్ లో గంటకు 0 నుంచి 96 కిమీ వేగం అయిపోతుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిమీ. ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ప్యూరియోసా అండ్ కరాటెరా అనే ఐదు డ్రైవింగ్ మోడ్ లు పెట్టారు. మొత్తానికి ఈ కారు డ్రైవ్ చేస్తుంటే ఫ్లైట్ లో వెళుతున్న ఫీలింగ్ కలుగుందని అంటున్నారు కంపెనీ వారు. ఆ వేగానికి ఎవరైనా థ్రిల్ అవ్వాల్సిందేనని చెబుతున్నారు.


Updated : 18 Aug 2023 10:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top