Home > టెక్నాలజీ > వరల్డ్ స్మాలెస్ట్ స్మార్ట్‌ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వరల్డ్ స్మాలెస్ట్ స్మార్ట్‌ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వరల్డ్ స్మాలెస్ట్ స్మార్ట్‌ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
X

మార్కెట్‎లో వందల కొద్దీ స్మార్ట్ ఫోన్‎లు అందుబాటులో ఉన్నప్పటికీ కొత్తగా ఏది వచ్చినా జనం ఎగబడి మరీ కొంటారు. అందుకే మేకర్స్ కూడా మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో అదిరిపోయే డిజైన్లలో ఫోన్‎లను తయారు చేసి లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లో ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్‎ను విడుదల చేశారు. దీని ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.


చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్‎ను తయారు చేసింది. ట్రాన్స్పరెంట్ డిజైన్స్‎తో జెల్లీ స్టార్ అనే 3 అంగుళాల ఆండ్రాయిడ్ ఫోన్‎ను తాజాగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్‌ఈడీ నోటిఫికేషన్ లైట్‌ను ఇచ్చింది సంస్థ. ఫోన్‌ ట్రాన్స్పరెంట్ కావడంతో లోపల ఉన్న భాగాలు, బ్యాక్‌ ప్యానెల్ నుంచి స్పష్టంగా కనిపిస్తాయి.



ఈ బుల్లి స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.17 వేలు. ప్రస్తుతం మార్కెట్‎లో యూజర్లకు అందుబాటులో లేదు. ఈ సంస్థ హాంకాంగ్‎లో మాత్రమే ఈ స్మాలెస్ట్ ఫోన్‎ను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 8జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో వచ్చిన ఈ మొబైల్ కస్టమర్లను కచ్చితంగా ఆకర్షిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.


3 అంగుళాల ఈ స్మార్ట్ ఫోన్‎కు 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌‎తో రూపొందించారు. 48 MP రియర్‌ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరాతో 2000mAH బ్యాటరీ ఉంటుంది.

Updated : 25 Jun 2023 7:16 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top