Home > టెక్నాలజీ > X ను ఇంక అలాగే చూడగలరు అంట

X ను ఇంక అలాగే చూడగలరు అంట

X ను ఇంక అలాగే చూడగలరు అంట
X

ట్విట్టర్ లో రోజుకో మార్పును తీసుకువస్తున్నారు. రీసెంట్ గా దీని పేరు ట్విట్టర్ నుంచి ఎక్స్ గా మార్చారు. లోగో పిట్ట స్థానంలో ఎక్స్ సింబల్ వచ్చింది. ఇప్పుడు మరొక మార్పును తీసుకువచ్చేశారు ఎలాన్ మస్క్.త్వరలో ఎక్స్ ప్లాట్ ఫామ్ మొత్తాన్ని డార్క్ మోడ్ లో మాత్రమే చూడగలరుట. ఇది స్వయంగా ఎలాన్ మస్కే తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపారు. ప్రస్తుతం ట్విట్టర్ సెట్టింగ్స్ లోని డిస్ ప్లే ఆప్షన్స్ లో లైట్, డార్క్, డిమ్ మోడ్ లు ఉన్నాయి. ఎలాన్ మస్క్ చెప్పిన ప్రకారం మారితే మొత్తం డార్క్ అయిపోతుంది.

టెస్లా ఓనర్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ేదొక మార్పు చేస్తూనే ఉన్నారు. బ్లూటిక్ ను తొలగించారు. నెలకు కొంత మొత్తం చెల్లిస్తేనే బ్లూటిక్ వస్తుందని చెప్పారు ట్వీట్ లు చూడ్డానికి, చేయడానికి కూడా పరిమితులు విధించారు. కానీ తర్వాత యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని తీసేశారు. కొన్నాళ్ళ క్రితమే ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. పిట్ట స్థానంలో ఎక్స్ వచ్చింది. ఎక్స్ ను ఓ సూపర్ యాప్ గా అభివృద్ధి చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దాని కోసమే ఈ మార్పులన్నీ అని అంటున్నారు. డార్క్ మోడ్ లోకి మారడం కూడా అందులో భామే అని తెలుస్తోంది. ఇది అన్ని విధాలుగా మంచిదని ఆయన అంటున్నారు.


Updated : 28 July 2023 7:14 PM IST
Tags:    
Next Story
Share it
Top