యూట్యూబ్ గుడ్ న్యూస్...మానిటైజేషన్ రూల్స్‌లో మార్పులు
X
ప్రస్తుతం యూట్యూబ్ గొప్ప ఆదాయ వనరుగా మారింది. చాలా మంది యువత యూట్యూబర్‌గా తమ కెరీర్‌ను మార్చుకుంటున్నారు. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరగడంతో కంటెట్ క్రియేటర్స్‌గా మారుతున్నారు.దీంతో చిన్నచిన్న క్రియేటర్స్‌ను ప్రోత్సాహించే విధంగా యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు (YPP) సంబంధించిన నిబంధనలను సవరించింది. కొత్త మానిటైజేషన్ విధానంతో ముందుకొచ్చింది.
ప్రస్తుతం యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే సంవత్సరంలో 4000 గంటల వాచ్ అవర్స్, 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. ఆ నిబంధనలను ఇప్పుడు సరళీకరించింది. క్రియేటర్‌లు ఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే వైపీపీద్వారా డబ్బులు సంపాదించవచ్చు. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో 3 వేల గంటల వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉంటే సరిపోతోంది.
ఈ నిబంధనలు ముందుగా యూఎస్, యూకే, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ అమలు చేయనుంది. భారత్‌కు ఎప్పుడు తీసుకొచ్చేదీ మాత్రం క్లారిటీ రాలేదు.