Home > తెలంగాణ > ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
X

జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిని చూడాలనుకున్న చిన్నారుల సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మానవపాడు మండలం పల్లెపాడు గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) గా గుర్తించారు. ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన కొంతమంది వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరువెల్లి గ్రామానికి వచ్చారు. కృష్ణా నదిలో స్నానం చేయాలని తలంచి సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న కృష్ణానదికి వెళ్లారు. ఐదుగురు చిన్నారులు వెళ్గగా నలుగురు కృష్ణా నదిలో మునిగిపోయారు. ఓ పాప మాత్రం ఒడ్డున ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Updated : 5 Jun 2023 4:38 PM IST
Tags:    
Next Story
Share it
Top