కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టింది : రేవంత్
X
కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదనన్న కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తు చేశారు. ఆనాడు పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం వహించారని చెప్పారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టారని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన గంగాపురం రాజేందర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
ఈ చేరికలు రాష్ట్రాన్ని కేసీఆర్ నుంచి విముక్తి కలిగించేందుకేనని రేవంత్ అన్నారు. ‘‘ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే. కాంగ్రెస్ పార్టీలో చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక. 22ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా’’ అని రేవంత్ ప్రశ్నించారు..
నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు
రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌కు లేదని.. కేసీఆర్ దోపిడీకి 4 కోట్ల రాష్ట్ర ప్రజలు బలయ్యారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు దారిదోపిడి దొంగలని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్ల పాలనలో నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
tpcc chief revanth reddy fires on cm kcr and minister ktr
revanth reddy,cm kcr,minister ktr,harish rao,tpcc chief,brs,congress,achampet,nagarkurnool,