Home > తెలంగాణ > రాష్ట్రంలో ఇవాళ 10 కరోనా కేసులు

రాష్ట్రంలో ఇవాళ 10 కరోనా కేసులు

రాష్ట్రంలో ఇవాళ 10 కరోనా కేసులు
X

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో ఈ రోజు 10 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు హెల్త్ డిపార్ట్మెంట్ బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్కరు రికవరీ అవ్వగా, 55 మంది చికిత్స పొందుతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో ఒక ఇంటిలో ఐదుగురికి కరోనా సోకిన విషయం సంచలనం సృష్టించింది. కాగా దేశంలో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన కొంత అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 20న మంత్రి ధనంజయ్ ముండే కరోనా బారినపడినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.


Updated : 25 Dec 2023 9:43 PM IST
Tags:    
Next Story
Share it
Top