Home > తెలంగాణ > CBSC పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త టైం టేబుల్ ఇదే

CBSC పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త టైం టేబుల్ ఇదే

CBSC పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త టైం టేబుల్ ఇదే
X

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల డేట్‌ ను బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆ టైం టేబుల్ లో పలు మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో మార్చిన టైం టేబుల్ ను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగాల్సిన 10వ తరగతి పరీక్షను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5వ తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ ఎగ్జామ్స్ ను ముందుకు తీసుకొచ్చారు.

ప్రెంఛ్ ఎగ్జామ్ ఫిబ్రవరి 20న, టిబెటన్ ఎగ్జామ్ ఫిబ్రవరి 23న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కాగా 12వ తరగతి పరీక్షల్లో కేవలం ఫ్యాషన్ స్టడీస్ పరీక్ష తేదీనే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21కి మార్చారు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ ప్రతీరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకుని పరీక్ష తేదీలను మార్చినట్లు తెలిపారు.

Updated : 5 Jan 2024 9:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top