Home > తెలంగాణ > దశాబ్ది ఉత్సవాల గిఫ్ట్.. 141 మంది సీఐలకు డీఎస్పీగా ప్రమోషన్

దశాబ్ది ఉత్సవాల గిఫ్ట్.. 141 మంది సీఐలకు డీఎస్పీగా ప్రమోషన్

దశాబ్ది ఉత్సవాల గిఫ్ట్.. 141 మంది సీఐలకు డీఎస్పీగా ప్రమోషన్
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజున పోలీస్‌ శాఖ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదోన్నతల కోసం నిరీక్షిస్తున్న సీఐలకు ప్రమోషన్లు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 141 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారందరికీ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ శుభాకాంక్షలు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ నుంచి సీఐ, డీఎస్‌పీ నుంచి అడిషనల్ ఎస్‌పీ, అడిషనల్ ఎస్‌పీ నుంచి ఎస్‌పీ ప్రమోషన్లు వచ్చాయి. ఇదే క్రమంలో సీఐ నుంచి డీఎస్‌పీ ప్రమోషన్లు కూడా ఇచ్చారు.

Updated : 22 Jun 2023 9:24 PM IST
Tags:    
Next Story
Share it
Top