Telangana Holiday : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 15న సెలవు
X
సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం. సేవాలాల్ తన రచనలతో ప్రజలను జాగృతం చేశారు. ప్రధానంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. ఇక ఆయన జయంతిని బంజారాలు ప్రతి ఏటా అట్టహాసంగా జరుపుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆయన జయంతిని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే ఆ రోజున సెలవు ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నా అటు కేంద్రం ఇటు రాష్ట్రం స్పందించలేదు.
ఈ క్రమంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న సెలవు ప్రకటించింది. ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 నాటికి హైదరాబాద్లో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై బంజారాలు సంతోషం హర్షం వ్యక్తం చేశారు.