Home > తెలంగాణ > KTR : రంగంలోకి కేటీఆర్.. వీగిపోయిన కౌన్సిలర్ల అవిశ్వాసం

KTR : రంగంలోకి కేటీఆర్.. వీగిపోయిన కౌన్సిలర్ల అవిశ్వాసం

KTR : రంగంలోకి కేటీఆర్.. వీగిపోయిన కౌన్సిలర్ల అవిశ్వాసం
X

బీఆర్ఎస్ పార్టీకి సిరిసిల్ల కౌన్సిలర్లు షాకిస్తూ.. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం వేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ ఆధిపత్యం చెలాయించడం, కౌన్సిలర్ల సమస్యలు పట్టించుకోకపోవడంతో.. ఈ వివాదం చెలరేగింది. దీంతో మొత్తం 16 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ లో క్యాంపుకు చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసం లేవనెత్తారు. అయితే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ విషయంపై కౌన్సిలర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో ఈ వివాదం సద్దుమనిగింది. హైదరాబాద్ క్యాంపు నుంచి కౌన్సిలర్లు తిరిగి సిరిసిల్లకు చేరుకున్నారు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. ఇక లేనట్లేనని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్ది రోజులుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణిపై 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం వేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో సమీక్షలు జరుగుతుండగానే.. హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాలు నడిచాయి. బడా నాయకుల ఆధిపత్యం తట్టుకోలేక.. కౌన్సిలర్లు అవిశ్వాసం దిశగా అడుగులు వేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఈ ఉదంతం జరగడం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కౌన్సిలర్లు సమస్యలు పట్టించుకోక పోవడం, సమస్యలపై చర్చించేందుకు కైన్సిలర్లతో.. కేటీఆర్ కలవకపోవడం అవిశ్వాసానికి కారణాలే. చైర్మన్ కు సంబంధించిన వ్యక్తులు ఆధిపత్యమే కాకుండా.. కేటీఆర్ తో కలిసి పనిచేసేవారు కూడా వారి విషయాల్లో తలదూర్చడంపై కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా శాంక్షన్ చేయలేదు. అయినా సొంత ఖర్చుపెట్టి నియోజకవర్గాల్లో పనులు జరిపించినా.. వాటి బిల్లులు నెరవేర్చకపోవడం, చైర్మన్ సొంత మనుషులకే పనులు మంజూరు చేయడంపై కౌన్సిలర్లలో అసమ్మతి నెలకొంది. కాగా ఈ విషయంపై కౌన్సిలర్లకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడటంతో వివాదం సద్దుమనిగింది.




Updated : 29 Jan 2024 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top