Home > తెలంగాణ > ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్లలో రైళ్లు రద్దు..

ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్లలో రైళ్లు రద్దు..

ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్లలో రైళ్లు రద్దు..
X

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 22 రైళ్లను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎంఎంటీఎస్ ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు సూచించారు.





మౌలిక వసతి సదుపాయాల అభివృద్ధి పనుల వల్ల ఈ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. లింగంపల్లి-హైదరాబాద్‌, ఉందానగర్ – లింగంపల్లి, ఫలక్‌నుమా – లింగంపల్లి, రామచంద్రాపురం – ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌లు సేవలను వారం పాటు నిలిపివేస్తున్నారు. దీంతో రోజు ఆఫీస్ లు, పనులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు.


Updated : 12 Aug 2023 9:42 PM IST
Tags:    
Next Story
Share it
Top