Home > తెలంగాణ > గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్..24 మంది కార్పొరేటర్లు జంప్ ?

గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్..24 మంది కార్పొరేటర్లు జంప్ ?

గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్..24 మంది కార్పొరేటర్లు జంప్ ?
X

బీఆర్‌ఎస్ పార్టికి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా హైదరాబాద్‌లోని 24 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఒక దపా చర్చలు పూర్తయినట్లు సమాచారం. తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు సమావేశానికి ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గైర్హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నజరిగిన కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తానంటే దానికి తాము చేసేది ఏం లేదన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలు ఉంటాయని.. అట్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పొయ్యేవాళ్లు వాళ్ల ఖర్మ అని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా కల నెరవేరలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండుసార్లు హామీ ఇచ్చి మొండిచేయి చూపారు. దీంతో ఇంకా ఆ పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు మసకబారుతుందని భావించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో తమకేమీ విభేదాలు లేవని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. పార్టీ మారే ఆలోచన లేదన్నారు. ఫంక్షన్ వల్లనే కార్పొరేటర్ల సమావేశానికి హాజరుకాలేకపోయానని చెప్పారు. పార్టీ అధిష్టానం మేరకే పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

Updated : 11 Feb 2024 12:32 PM IST
Tags:    
Next Story
Share it
Top