జీహెచ్ఎంసీలో తేలిన లెక్క.. 15 స్థానాల్లో 312 మంది పోటీ
X
జీహెచ్‌ఎంసీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. 15 స్థానాలకు 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో పోటీలో ఉన్నవారి జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 173 మంది పోటీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం - 28, ఎల్బీనగర్ 38, మహేశ్వరం 27, రాజేంద్రనగర్ 25, శేరిలింగంపల్లి 33, చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 48 మంది పోటీలో ఉన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 173 మంది బరిలో మిగిలారు. కల్వకుర్తి నుంచి అత్యధికంగా 24 మంది పోటీ చేస్తుండగా, గద్వాల నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పరిగిలో 15, వికారాబాద్‌లో 12, తాండూరులో 21 మంది ఎన్నికల పోరులో నిలిచారు.