Home > తెలంగాణ > నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
X

హైదరాబాద్ మహా నగరంలో సోమవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి కాలనీలన్నీ జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో బాచుపల్లిలో ఓ విషాద ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బాచుపల్లి సమీపంలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మిథుర్ గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడిపోయాడు. నితిన్ కోసం గాలిస్తుండగా అతని మృతదేవం రాజీవ్ స్వగృహ వద్ద కనిపించింది. దీంతో సహాయక సిబ్భంది మృతదేహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అదికాస్త విఫలం కావడంతో మృతదేహం మళ్లీ తుర్క చెరువు వరకు కొట్టుకుపోయింది. డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు పిల్లాడి మృతదేహం ఆచూకి కోసం చెరువు వద్దకు వెళ్లి దాదాపు నాలుగు గంటల నుంచి గాలిస్తున్నారు.

Updated : 5 Sept 2023 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top