Home > తెలంగాణ > కేజీబీవీలో కలుషితాహారం..70 మంది విద్యార్థినులకు అస్వస్థత

కేజీబీవీలో కలుషితాహారం..70 మంది విద్యార్థినులకు అస్వస్థత

కేజీబీవీలో కలుషితాహారం..70 మంది విద్యార్థినులకు అస్వస్థత
X

వనపర్తి జిల్లాలోని కేజీబీవీలో కలుషితాహారం కలకలం రేపింది. రాత్రి తిన్న భోజనం వికటించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ సమీపంలోని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురకావడంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థినుల గురువారం రాత్రి వంకాయ, సాంబారుతో భోజనం చేశారు. భోజనం చేసిన కాసేపటికే 9,10వ తరగతి విద్యార్థులకు కడుపునొప్పి ప్రారంభమైంది. రాత్రి సమయం కావడం, సిబ్బంది ఇద్దరే ఉండడంతో వారిని ఆస్పత్రికి పంపించలేదు. తెల్లారి మొత్తం 70 మంది విద్యార్థులను సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని.. వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆత్మకూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురయ్యారు. కేజీబీవీని అధికారులు, పోలీసులు పరిశీలించి.. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Updated : 7 July 2023 5:05 PM IST
Tags:    
Next Story
Share it
Top