Home > తెలంగాణ > తెలంగాణ నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు.. సీఎం కేసీఆర్‌ హర్షం

తెలంగాణ నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు.. సీఎం కేసీఆర్‌ హర్షం

తెలంగాణ నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు.. సీఎం కేసీఆర్‌ హర్షం
X

తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. యాదాద్రి ఆలయం సహా 5 భవనాలకు ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కించుకున్నాయి. లండన్‌కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ఈ అవార్డులను ప్రకటించింది. అవార్డులు పొందిన వాటిలో మొజాంజాహీ మార్కెట్‌, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్‌ రూం, యాదగిరిగుట్ట ఆలయం ఉన్నాయి.



బ్యూటిఫుల్‌ వర్క్‌స్పేస్‌ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయానికి, హెరిటేజ్‌ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్‌కు, యూనిక్‌ డిజైన్‌ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జికి, స్పెషల్‌ ఆఫీస్‌ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు వచ్చాయి. మే 16న లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ ఈ అవార్డులను అందుకోనున్నారు. కాగా, తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కడం విశేషం.













Updated : 14 Jun 2023 1:44 PM IST
Tags:    
Next Story
Share it
Top