Home > తెలంగాణ > ఈ 9 ఏళ్లలో పాత బస్తీలో కరెంటు సమస్య లేదు..Minister Jagadish Reddy

ఈ 9 ఏళ్లలో పాత బస్తీలో కరెంటు సమస్య లేదు..Minister Jagadish Reddy

ఈ 9 ఏళ్లలో పాత బస్తీలో కరెంటు సమస్య లేదు..Minister Jagadish Reddy
X

హైదరాబాద్‌ పాత బస్తీలో 1,404.58 కోట్ల వ్యయంతో విద్యుత్ పనులు చేపట్టామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే 1,330.94 కోట్ల విద్యులు నిర్మాణాలు పూర్తి అయ్యాయని వివరించారు. పెండింగ్‎లో ఉన్న 73.64 కోట్ల పనులు కూడా పురోగతిలో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇవాళ తెలంగాణ శాసనమండలి సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎంకు పార్టీ ఎమ్మెల్సీలు మీర్జా రియాజల్ హసన్, మీర్జా రహమత్ బేగ్ లు అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు.

" ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్లు ఖర్చుతో విద్యుత్ నిర్మాణాలు చేపట్టాము. ఇప్పటికే 1,330.94 కోట్ల పనులు పూర్తి అయ్యాయి. మరో 73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులకు ట్రాన్స్‌కో 957.29 కోట్లు ఖర్చు చేయగా, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ 447.29 కోట్లు వెచ్చించింది. గత తొమ్మిదేళ్లలోనే పెద్ద మొత్తంలో ఖర్చు చేసి విద్యుత్ ప్రసారాలను క్రమబద్దీకరించాము. పాత బస్తీలో కరెంట్ సమస్య రాకుండా చేశాము. పాత బస్తీలో 220 కేవీ సబ్ స్టేషన్లు, 132 కేవీ సబ్ స్టేషన్లు రెండు, 33/11 కే వి సబ్ స్టేషన్లు, 15,256 కి.మీ. ల 33 కేవీ లైన్‎తో పాటు 63 ఎక్స్‎ట్రా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశాము. 16 ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీని పెంచడంతో పాటు 565 కి.మీ. ల 11 కేవీ లైన్ ను ఏర్పాటు చేశాము.

ఓల్డ్‌ సిటీకి చెందిన శాసనసభ్యుల అభ్యర్థన మేరకే ఈ పనులు చేపట్టాము. సబ్ స్టేషన్ల పనులకు స్థలానికి సంబంధించిన ఆటంకాలు ఎదురైనా స్థానిక నేతల ప్రమేయంతో పరిష్కరించాం. రాష్ట్రంలో కరెంట్ కట్ లకు అస్కారమే లేదని నిరూపించాం. విపత్తు ఏర్పడినా విద్యుత్‎ సరఫరాకు అంతరాయం కలుగలేదు. ఈ ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థల యజమాన్యాలదే"అని ఆయన చెప్పారు.

Updated : 4 Aug 2023 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top