Home > తెలంగాణ > అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఆరు హామీలు

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఆరు హామీలు

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఆరు హామీలు
X

ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు కీలక హామీలు ప్రకటించారు. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా.. తెలంగాణలో త్వరలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు కీలక హామీలను ఈ సభా వేదికగా ప్రకటించారు. ఆ హమీల ప్రకటనతో ఇన్నిరోజులు కాంగ్రెస్‌ను పెద్దగా లెక్కచేయని కేసీఆర్ (CM KCR)కు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కీలక ప్రకటనలతో కచ్చితంగా ‘కారు’ పంచర్ కావడం పక్కా అని చెబుతున్నారు.

ఆ కీలక హామీలు ఇవే..

1. గృహ జ్యోతి : ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్

2. రైతు భరోసా : భూమి ఉన్న రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం

గుంట భూమి లేని కూలీలకు ఏటా రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్

3. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్

4. ఇందిరమ్మ ఇళ్లు : ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలుఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం

5. మహాలక్ష్మి : ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ.500కి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

6. యువ వికాసం : విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.

ఈ ఆరు గ్యారంటీ పథకాలతో పాటు పలు కీలక హామీలు కూడా ప్రకటించారు సోనియా గాంధీ. ప్రతి హామీ నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు. " నా స్వప్నం తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్నదే నా ఆకాంక్ష" అన్నారు. ఆరు నూరైనా అధికారంలోకి వచ్చాక ఈ ఆరు హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని సభా వేదికగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఎలా ఇచ్చిందో.. అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రాగానే హామీలను కూడా అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇక మీరంతా సపోర్టుగా నిలుస్తారా? అని ప్రశ్నించగా సమావేశానికి వచ్చిన జనమంతా.. కాంగ్రెస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.




Updated : 18 Sept 2023 7:56 AM IST
Tags:    
Next Story
Share it
Top