హైదరాబాద్‌లో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ బట్టలు విప్పి..
X
తాగిన మత్తులో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను నడి రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. 15 నిముషాల పాటు యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
జవహర్‌నగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30) దినసరి కూలీ. అతడు మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుంచి మారయ్య ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో 28 ఏళ్ల ఓ యువతి దుకాణం నుంచి తిరిగి ఇంటికి వెళుతోంది. యువతిని చూసిన మారయ్య ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో యువతి అతడిని దూరంగా నెట్టేసింది. కోపోద్రిక్తుడైన మారయ్య యువతిపై దాడి చేశాడు. ఆపై ఆమె దుస్తులను చించేశాడు. పక్కనే ఉన్న అతడి తల్లి కనీసం అడ్డుకోలేదు.
దాదాపు 15 నిముషాల పాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తూ కూర్చుంది. అయినా కూడా చుట్టుపక్కల వారు, రోడ్డుపై వెళ్తున్న వారు స్పందించలేదు. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేశావ్ అని మారయ్యను ప్రశ్నించడంతో.. కోపంతో ఆమె పైనా దాడికి ప్రయత్నించాడు. చివరకు మారయ్య వెళ్లాక కొందరు వచ్చి యువతిని కవర్లతో కప్పారు. ఆపై జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.