చొక్కాలు చించుకుని.. చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
X
వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎర్రబెల్లి స్వర్ణ డీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరరుల మధ్య జరిగిన ఈ గొడవ కెమెరాల్లో రికార్డ్ అయింది. డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఎన్నికైన తర్వాత తొలిసారి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కొండా దంపతులు హాజరు కాకపోవడం గమనార్హం.
సమావేశం జరుగుతున్న క్రమంలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. కొండా వర్గానికి చెందిన జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సంతోష్ పై.. ఎర్రబెల్లి వర్గానికి చెందిక కట్ట స్వామి నేతృత్వంలో దాడి చేశారు. ఇరు వర్గాలు చొక్కాలు చించుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు. గొడవకు వచ్చిన కొండా వర్గం కార్యకర్తల అంతు చూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ వార్గింగ్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇది గ్రూప్ వార్ కాదని, కులం పేరుతో ఓ వ్యక్తిని దూషించినందుకు నెలకొన్న వివాదం అని కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తున్నారు.