Bhadradi Ram Temple : అట్టహాసంగా భద్రాది రామాలయంలో రథోత్సవం
X
అయోధ్య రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం రామాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేద మంత్రలు మంగళ వాయిద్యాలు, హరిదాసుల కీర్తనలతో పట్టణంలో రాఘవుడి రథ యాత్ర వైభవంగా కొనసాగింది.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నాడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. జై జై శ్రీరామ్ నినాదాలతో పట్టణమంతా మారుమోగింది. మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిత్య కళ్యాణ మండపంలో ఉదయం సీతారాములకు సువర్ణ పుష్పార్చన చేసిన అనంతరం..
సీతారాములను పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర చేయనున్నారు. శ్రీ రామ ప్రచార రథంతో శోభాయాత్ర.. సాయంత్రం సుందరకాండ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అయోధ్య రాముడి ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అలాగే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు.. శోభాయాత్ర వంటి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.