TS Assembly Election 2023: పోలీసుల తనిఖీలు.. మియాపూర్‌లో 27 కిలోల బంగారం స్వాధీనం
X
ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న 27.540 కిలోల బంగారం, 15.650 కిలోల వెండి వస్తువులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం, వెండి ఆభరణాలకు బిల్లులు చూపక పోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. బంగారం, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా మరో చోట వాహన తనిఖీల్లో భాగంగా రూ. 14 లక్షలు పట్టుబడినట్లు మియాపూర్ సీ ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. తనిఖీల్లో దొరికిన బంగారం, వెండి, నగదు ను ఐటీ శాఖ అధికారులకు అప్పగించినట్లు సీ ఐ తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, రవాణా శాఖ, కమిర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహిస్తున్న సోదాల ద్వారా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడుతున్నాయి.