Home > తెలంగాణ > హైదరాబాద్లో వింత కేసు... 6 పిల్లుల హత్య..

హైదరాబాద్లో వింత కేసు... 6 పిల్లుల హత్య..

హైదరాబాద్లో వింత కేసు... 6 పిల్లుల హత్య..
X

ఓ వ్యక్తి 10 పిల్లులను పెంచుకుంటున్నాడు. వాటి ఆలన పాలన చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఓ రోజు అతడు ఇంటికి వచ్చేసరికి 6 పిల్లులు మృతి చెంది ఉన్నాయి. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టాడు. తన పిల్లలను ఎవరో చంపారని.. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని భోలక్ పూర్లో జరిగింది.

భోలక్ పూర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి 10 పిల్లులను పెంచుకుంటున్నాడు. అయితే స్థానికులకు అది ఇబ్బందిగా మారింది. పిల్లులు తమ ఇళ్లల్లోకి వస్తూ నానా రచ్చ చేస్తున్నాయని పలుసార్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పిల్లుల యజమాని మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. పిల్లులు బయటకు వస్తే నేనేం చేయాలంటూ ఉల్టా మాట్లాడడంతో స్థానిక కాలనీ వాసులు సైలెంట్ అయ్యారు.

ఈ క్రమంలో అతడు ఇంటికి వచ్చేసరికి 10 పిల్లుల్లో 6 మరణించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు యజమాని ఇదంతా కాలనీవాసుల పనే అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తన పిల్లులను కాలనీవాసులే విషమిచ్చి చంపారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాకుండా పిల్లుల మృతదేహాలను తీసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే పోలీసుల కంప్లైంట్ ఉండాలని డాక్టర్లు చెప్పడంతో అతడు తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలన్న అంశంపై పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు.

Updated : 26 Aug 2023 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top