నిర్మాణంలో ఉన్న భవనంలో మహిళపై హత్యాచారం
X
హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసారు కొంత మంది దుండగులు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… నానక్ రాంగూడ ఫైనాన్సిషయల్ డిస్ట్రిక్ట్ లోని ఓ నిర్మాణ సంస్థలో ఈ హత్యాచారం జరిగినట్లు తెలిసింది. గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీ కీ చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. కాశమ్మ w/o సాంబయ్య 38 అని తెలిపారు. వేస్ట్ మెటీరియల్ తీసుకొవడానికి శుక్రవారం నిర్మాణ సంస్థకు వచ్చిన మహిళను రేప్ చేసి అనంతరం బండరాయి తో మోదీ చంపారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు షాక్‌కు గురయ్యారు. బాధితురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న కూలీలు, ఇతర సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.