Home > తెలంగాణ > Srilatha Shoban Reddy : గ్రేటర్లో బీఆర్ఎస్కు వరుస షాక్లు..సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్ దంపతులు

Srilatha Shoban Reddy : గ్రేటర్లో బీఆర్ఎస్కు వరుస షాక్లు..సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్ దంపతులు

Srilatha Shoban Reddy : గ్రేటర్లో బీఆర్ఎస్కు వరుస షాక్లు..సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్ దంపతులు
X

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్వాద పూర్వకంగా కలిశారు. గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, మరో రెండు రోజుల్లో వీరిద్దరూ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. ఉద్యమకారులను కేసీఆర్, కేటీఆర్ అవమానిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్య గ్రేటర్ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి కూడా వీళ్లూ గైర్హాజరయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్దరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో మూడు రంగుల కండువా కప్పుకునే అవకాశం ఉంది. అంతేగాక ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్.

గ్రేటర్ లో బీఆర్ఎస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు బారులు తీరుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చించారు బొంతు రామ్మోహన్. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరికితోడు మరికొందరు గ్రేటర్ లోని బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కు బై చెప్పి హాస్తంతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.







Updated : 13 Feb 2024 8:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top