MLA Aroori ramesh : వరంగల్లో బీఆర్ఎస్కు షాక్..బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి?
X
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆ పార్టీ వీడి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. రేపు ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆరూరి తన అనుచరులతో కలిసి మంతనాలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఆరూరిని బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. కానీ అందుకు కడియం శ్రీహరి నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను బీఆర్ఎస్ రంగంలోకి దించినట్లు ఆరూరితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆరూరి చెబుతున్నట్లు సమాచారం. మోదీ సమక్షంలో తన అనుచరవర్గంతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఎస్సీ రిజర్వడ్ కావడంతో ఆరూరికి బీజేపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ హామీతో ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది.