Home > తెలంగాణ > చెరువులో దొంగ.. గట్టున పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

చెరువులో దొంగ.. గట్టున పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

చెరువులో దొంగ.. గట్టున పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
X

అతడో దొంగ. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. పరిగెత్తాడు. జనాల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకాడు. చెరువు మధ్యలో ఓ బండరాయిపై హాయిగా కూర్చుకున్నాడు. పోలీసులు ఎంత బతిమిలాడిన బయటకు వచ్చేందుకు ససేమీరా అన్నాడు. పైగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మీడియా అక్కడికి వస్తేనే బయటకు వస్తానని తెగేసి చెప్పాడు. దీంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయనగర్‌లో నాగలక్ష్మి దంపతులు ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. సాయంత్రం 4.30 సమయంలో వారి కూతురు సాయిజ్యోతి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచేవున్నాయి. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా వద్ద ఓ వ్యక్తి కూర్చుని డబ్బులు లెక్కిస్తూ కన్పించాడు. వెంటనే ఆమె భయపడి దొంగ.. దొంగ అంటూ కేకలు వేసుకుంటూ బయటకు వెళ్లింది. దీంతో స్థానికులు రాగా.. అప్పటికే దొంగ పారిపోతుండగా స్థానికులు వెంబడించారు.

ఈ క్రమంలో ఆ దొంగ పెద్ద చెరువులోకి దిగి ఓ బండరాయిపై ఎక్కి కూర్చున్నాడు. చెరువు వద్దకు పోలీసులు చేరుకుని అతన్ని బయటకు రమ్మని బతిమాలినా రాలేదు. బయటకు వస్తే పోలీసులు కొడతారని.. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మీడియాను రప్పిస్తేనే బయటకు వస్తానని దొంగ తేల్చిచెప్పాడు. నువ్వు బయటకు వచ్చేసరికి వారంతా వస్తారని పోలీసులు చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు కూడా దొంగ కోసం చెరువు వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది.


Updated : 16 Dec 2023 11:37 AM IST
Tags:    
Next Story
Share it
Top