Home > తెలంగాణ > భాగ్యనగరంలో ఇంగ్లండ్ జట్టుకు ఘన స్వాగతం

భాగ్యనగరంలో ఇంగ్లండ్ జట్టుకు ఘన స్వాగతం

భాగ్యనగరంలో ఇంగ్లండ్ జట్టుకు ఘన స్వాగతం
X

భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది.శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లిష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్ల నుదుటన తిలకం దిద్ది ఆహ్వానించారు.ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. రెండో టెస్టుకు విశాఖపట్టణం వేదిక కానుంది. కాగా, విమానాశ్రయంలో క్రికెటర్లను చూసిన అభిమానులు వారిని తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు పోటీపడ్డారు. అయితే గత కొన్నిరోజులుగా.. అబుదాబిలో శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఇంగ్లాండ్.. భాగ్యనగరంకు వచ్చేసింది. మ్యాచుకు మూడు రోజుల ముందు ఇక్కడ ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ఖాతాలో సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఆ వీడియోలో టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్, స్టార్ ప్లేయర్ జో రూట్ వంటి వారు కనిపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ నుంచి వారంత హోటల్‌కు వెళ్లారు. హోటల్ చేరుకున్న ఇంగ్లీష్ ప్లేయర్లకు సిబ్బంది పూల బొకేలతో స్వాగతం పలికారు.గతేడాది సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లీష్ జట్టు .. ఆ తర్వాత బలంగా పుంజుకుంది. సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. అయితే వన్డే వరుల్డ్ ‌కప్‌లో దారుణ ప్రదర్శనతో సెమీ ఫైనల్‌ కూడా చేరలేకపోయింది. భారత్‌తో సిరీస్ కోసం.. కొన్ని రోజులుగా అబుదాబీలో క్యాంప్ నిర్వహించింది. గత రెండేళ్లుగా బజ్‌బాల్ ఆటతో టెస్టు క్రికెట్ శైలినే మార్చేసిన ఇంగ్లాండ్.. టీమిండియాతో కూడా అదే పంథాలో ఆడాలని భావిస్తోంది. ఇటీవల సపారీలతో టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్.. సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును చిత్తుగా ఓడించాలని పట్టుదలతో ఉంది.

తొలి రెండుటెస్టులకు భారత జట్టు

రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్.

ఇంగ్లండ్ జట్టు

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, జోరూట్, మార్క్‌వుడ్, షోయిబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డాన్ లారెన్స్, టామ్ హార్ట్లీ, జాక్‌లీచ్, అలీ పోప్, అలీ రాబిన్సన్

Updated : 22 Jan 2024 1:59 PM IST
Tags:    
Next Story
Share it
Top