ఒకే కాన్పులో ముగ్గురు జననం..ఆమెకు 10 మంది సంతానం..!
Mic Tv Desk | 5 July 2023 8:28 PM IST
X
X
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బట్టిగూడెం గ్రామానికి చెందిన ఊకే పొజ్జా అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. జూలై 2వ తేదిన నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. బుధవారం సాయంత్రం ఆమె సుఖ ప్రసవం ద్వారా ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మగ శిశువులు 1.8 కిలోలు, 1.75 కిలోలు బరువు ఉండగా.. ఆడ శిశువు 1.5 కిలోల బరువు ఉంది. అయితే ఆ మహిళకు ఇది ఎనిమిదో కాన్పు కావడం గమనార్హం. తాజాగా పుట్టిని ముగ్గురు శిశువులతో కలిపి ఆమె సంతానం 10 మంది. అంతకుముందు పుట్టిన ఏడుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు. దీంతో మొత్తం పొజ్జా-దేవా దంపతులకు మొత్తం ఐదుగురు మగ పిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.
Updated : 5 July 2023 8:28 PM IST
Tags: A woman birth to 3 children single delivery badrachalam hospitial Chhattisgarh State woman A total of 10 children
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire