Home > తెలంగాణ > డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు.. కస్టమర్ ఏం చేశాడంటే.?

డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు.. కస్టమర్ ఏం చేశాడంటే.?

డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు.. కస్టమర్ ఏం చేశాడంటే.?
X

చాక్లెట్లు అంటే పిల్లలకు మహా ఇష్టం. అమ్మాయిలు, పిల్లలు వాటికోసం పడి చస్తుంటారు. చాక్లెట్ల కోసం కావాల్సిన వారితోనే గొడవ పడుతుంటారు. చాక్లెట్లలో క్యాడ్ బరీ డైరీ మిల్క్ది ప్రత్యేక స్థానం. చాక్లెట్తో పాటు తియ్యని వేడక చేసుకుందాం అంటూ వచ్చే యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తియ్యని వేడుక పక్కనబెడితే.. ఓ కమస్టమర్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మళ్లీ చాక్లెట్ అంటేనే భయపడేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్పేట్లోని రత్నదీప్ మెట్రోలో క్యాడ్ బరీ చాక్లెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి చాక్లెట్ కవర్ ఓపెన్ చేయగా.. ఓ పురుగు కదులుతూ కనిపించింది. దీంతో అతడు అవాక్కయ్యాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్స్ను అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. ఇటువంటి వాటి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. దీనికి డైరీ మిల్క్, జీహెచ్ఎంసీలను ట్యాగ్ చేశాడు.

ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డైరీ మిల్క్ కంపెనీ సహా జీహెచ్ఎంసీ రిప్లై ఇచ్చాయి. మరోవైపు నెటిజన్లు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. కంపెనీని కోర్టుకు ఈడ్చాలని, కొందరు కామెంట్ చేస్తే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారని మరికొందరు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ చాక్లెట్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

Updated : 11 Feb 2024 11:50 AM IST
Tags:    
Next Story
Share it
Top